హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యం: కలెక్టర్

ADB: జిల్లాలో విద్యార్థులకు బోధనతో పాటు ఆత్మవిశ్వాసం, విభిన్న కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు 'మై సెల్ఫ్' కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమ గోడప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. 9వ తరగతి విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి నూతన మార్గాలపై అవగాహన కల్పిస్తామన్నారు.