హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపాలపల్లి ఆస్పత్రి సమస్యలపై ఫైర్‌

BHPL: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలను తక్షణమే పరిష్కరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆస్పత్రిని సందర్శించి రోగుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.