హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ

HNK: విద్యార్థులు దాతలు అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. జీడబ్ల్యూఎంసీ 45వ డివిజన్‌ తరాలపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో బుధవారం బాలవికాస ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే పాల్గొని ల్యాప్‌టాప్‌లను అందజేశారు.