హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ దీక్ష

MBNR: మిడ్జిల్‌లో బీజేపీ కార్యాలయాలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడులను నిరసిస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజకీయ విభేదాలతో కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.