హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిరుపేదల వైద్యానికి సీఎం సహాయనిధి అండ'

నల్గొండ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 101 మంది నిరుపేదలకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి మొత్తం రూ.82.25 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని గుత్తా పేర్కొన్నారు.