GDWL: గ్రామాల రీసర్వేను పకడ్బందీగా, కచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం సంగాల గ్రామంలో రీసర్వే పనులను పరిశీలించారు. రైతుల సహకారంతో సరిహద్దులను గుర్తించి, రోవర్ పరికరాలతో సర్వే నిర్వహించాలని సూచించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్


