హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగన్నాథ్ యాత్రకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు

NRML: నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి పూరీ జగన్నాథ్ యాత్రకు బస్సు బుధవారం బయలుదేరింది. అన్నవరం, సింహాచలం, కోణార్క్ మీదుగా పూరీ చేరుకుని, పలు పుణ్యక్షేత్రాల మీదుగా సెప్టెంబర్‌ 7న నిర్మల్‌కు చేరుకుంటుందని డిపో మేనేజర్‌ కే.పండరి తెలిపారు. 30 మంది ప్రయాణికులు ఉంటే కోరిన ప్రాంతానికే బస్సు పంపిస్తామని చెప్పారు.