హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ధర్నా

MBNR: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ జడ్చర్లలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఎమ్మార్వో కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.