SRPT: నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు కోతి మరణించింది. ఆ కోతిని ఆంజనేయస్వామి ప్రతిరూపంగా భావించిన గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారంగా స్మశానంలో ఖననం చేశారు. అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయంలో కోతి ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
కోతికి శాస్రోక్తంగా అంత్యక్రియలు


