హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధ్వానంగా మండల కేంద్రానికి వెళ్లే రహదారి

ADB: భోరజ్ మండల కేంద్రానికి వెళ్లే రహదారి గుంతలతో కంకర తేలి అధ్వానంగా తయారైంది. రోడ్డుపై కంకర తేలి మధ్య భాగంలో గుంతలు ఏర్పడడంతో గ్రామస్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళలో ఈ రోడ్డులో ప్రయాణించడానికి ఇబ్బందిగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.