హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా కోసం రైతుల తిప్పలు

MDK: రైతుల యూరియా ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ బుకింగ్ విధానం తలనొప్పిగా మారింది. పాపన్నపేట పీఏసీఎస్‌లో యూరియా బుక్ చేసుకున్న రైతులకు ఈపాస్ మిషన్ మొరాయించడంతో పంపిణీ నిలిచిపోయింది. ఎండలో రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సాంకేతిక సమస్య పరిష్కరించి ప్రత్యామ్నాయ మిషన్‌తో యూరియా అందిస్తామని AO శ్రీనివాసరాజు తెలిపారు.