హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశైల మల్లన్న సేవలో ప్రభుత్వ విప్

PDPL: ఓదెల ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు బుధవారం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. దేవాదాయ శాఖ స్థపతి, ఓదెల ఈవోలతో కలిసి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలు, రైతులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం పండితులు ఆయనకు స్వాగతం పలికి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.