ATP: అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో MLA జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో సాగునీటి లభ్యత, రైతుల సాగు అవసరాలపై అధికారులతో చర్చించారు. తాడిపత్రి నియోజకవర్గ రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే


