హైదరాబాద్: 28°C
తెలంగాణ

NIMS వైద్యం, బెడ్ల వివరాలు ఫోన్‌లో తెలుసుకోండి..!

HYD: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పంజాగుట్ట NIMSకు పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఒక్కోసారి బెడ్లు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతాయి. వైద్యం, బెడ్ల లభ్యత, ఆసుపత్రి పరిస్థితులపై 04023489000, 04023489025 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చని వైద్యులు తెలిపారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులపై సమాచారం అందిస్తారు.