హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగు పెద్దాస్పత్రిలో సమస్యలెన్నో.!

MLG: జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం మండల బాధ్యులు రత్నం ప్రవీణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆర్‌ఎంఓకు వినతిపత్రం అందించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, మందులు, స్కానింగ్‌ సేవలు సరిగా అందడం లేదని ఆరోపించారు. వార్డుల్లో సమస్యలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.