హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయిల్‌పామ్‌ ధరలో సరికొత్త రికార్డు

KMM: ఆయిల్‌పామ్‌ గెలల ధర మార్కెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. గత నెలతో పోలిస్తే టన్నుకు రూ.500 పెరిగి, సెప్టెంబర్‌ నెలకు రూ.24,050గా ఖరారైంది. దేశంలోనే ఇదే అత్యధిక ధర అని అధికారులు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో గిట్టుబాటు ధర దక్కిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.