హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైఎస్సార్‌కు ఘన నివాళి

NLG: కొండ్రపోల్‌లో వైఎస్సార్‌ 17వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నివాళులర్పించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. పేదలు, రైతులు, బడుగు వర్గాల సంక్షేమానికి వైఎస్సార్‌ కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.