హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీజ్‌ వేడుకలకు సీతక్కకు ఆహ్వానం

MLG: ములుగు పట్టణ బంజారా నాయకులు మంత్రి సీతక్కను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పోరిక గోవింద్‌ నాయక్‌ ఆధ్వర్యంలో తీజ్‌ పండుగ ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేసి, వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు. పండుగ విశిష్టత, ఏర్పాట్లను వివరించగా సీతక్క సానుకూలంగా స్పందించారు.