హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ పనులపై కలెక్టర్‌ పరిశీలన

BHPL: గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం దేవాలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలయాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.