హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంకాలమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: చందంపేట మండలం చిత్రియాల గ్రామంలో శ్రీ అంకాలమ్మ–కాటమయ్య జాతర భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది. ఈ జాతర సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గ్రామానికి చేరుకుని కాటమయ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలోని రహదారి వెంట ఉన్న విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన వీధి దీపాలను ప్రారంభించారు.