హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నివాళులు

NLG: తిప్పర్తి మండల కేంద్రంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల కోసం వైఎస్సార్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలను నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.