హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎం చిత్రపటానికి అంగన్వాడీల పాలాభిషేకం'

ADB: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈ నెల 1వ తేదీన వేతనాలు చెల్లించటం పట్ల తెలంగాణ అంగన్వాడీ టీచర్, హెల్పర్స్ సంఘం నాయకురాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల హామీలో భాగంగా టీచర్లకు రూ.18 వేల చెల్లించాలని కోరారు.