KNR: గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. కొత్తపల్లి వినాయక నిమజ్జన స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లు కల్పించాలని సూచించారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు రమేష్, కవిత ఉన్నారు.
తెలంగాణ
'గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో లోటుపాట్లు ఉండొద్దు'


