KMM: జిల్లాలోని పాలేరు జలాశయానికి జలకళ వచ్చింది. సాగర్ నుంచి తాగునీటి కోసం విడుదల చేసిన నీరు నాలుగు రోజులుగా వచ్చి చేరుతుండటంతో బుధవారం నాటికి నీటిమట్టం 19.75 అడుగులకు పెరిగింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 1.999 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సాగర్ నీటి రాకతో జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి.
తెలంగాణ
పాలేరు జలాశయానికి జలకళ


