JGL: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం లచ్చానాయక్ తండాలో బుధవారం ఆయన రూ.50 లక్షల పనులకు శ్రీకారం చుట్టారు. రూ.20 లక్షలతో జీపీ భవనాన్ని ప్రారంభించి, మహిళా భవనం, సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. పల్లెల ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో డీపీవో మదన్ మోహన్ పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట: ఎమ్మెల్యే


