KMM: ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే రాగమయి సూచించారు. బుధవారం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఆమె, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. రోగులకు పౌష్టికాహారం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
తెలంగాణ
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: ఎమ్మెల్యే


