హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందించిన ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. జిల్లకర్ర నాగార్జునకు మంజూరైన చెక్కును అందించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులకు ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానన్నారు.