హైదరాబాద్: 28°C
తెలంగాణ

కదిలిలో శాస్త్రవేత్తల క్షేత్ర పర్యటన

NRML: దిలావర్‌పూర్ మండలం కదిలి, మాడేగాం గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్ర పర్యటన నిర్వహించారు. రైతులతో మాట్లాడి పంటలను పరిశీలించారు. చీడపీడల నివారణ, మెరుగైన దిగుబడుల కోసం విత్తన రకాలు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాజశేఖర్‌రెడ్డి, శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ పాల్గొన్నారు.