BDK: మణుగూరు మండలం రామానుజవరం గ్రామపంచాయతీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులు బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. సీసీ రోడ్లు, డ్రైన్లు, అంతర్గత రహదారులు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిశీలించి సహకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
'రామానుజవరానికి నిధులు మంజూరు చేయాలి'


