BHPL: వానాకాలం పంటల నమోదు కోసం రెవెన్యూ గ్రామాల వారీగా వాలంటీర్లను నియమించినట్లు రేగొండ ఏఈఓ భరత్ తెలిపారు. వాలంటీర్లు రైతుల పొలాలను సందర్శించి సాగు చేసిన పంట వివరాలను ఫొటోలతో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాల ఆధారంగానే పంటల కొనుగోలు జరుగుతుందని అధికారులు తెలిపారు. రైతులు సర్వేకు సహకరించాలని సూచించారు.
తెలంగాణ
పంటల సర్వేకు రైతులు సహకరించాలి: AEO


