హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్‌ బాకీ కార్డుల పంపిణీ'

BHPL:కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు తిరుపతిరావు విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు స్థానిక నేతలతో కలిసి కాంగ్రెస్‌ బాకీ కార్డులను పంపిణీ చేశారు. మహిళలకు రూ.2,500, పెన్షన్లు, రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.