KMM: బోనకల్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న హోంగార్డు నరేశ్‌తో పాటు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
లారీ బోల్తా.. హోంగార్డుకు గాయాలు


