హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షయ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

ADB: జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో టీబీ రహిత సమాజ నిర్మాణం సాధ్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి టీబీ లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వివరాలకు టోల్‌ఫ్రీ నంబరు 1800-11-6666 సంప్రదించాలని తెలిపారు.