హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరకాలలో ఘనంగా పోచమ్మ బోనాలు

HNK: పరకాలలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బోనాలను అలంకరించి డప్పు చప్పుళ్లు, భక్తి గీతాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనం సమర్పించారు. పండుగ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.