హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరాలు: కలెక్టర్‌

BDK: జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు సెప్టెంబరు 3 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. సదరం ధ్రువీకరణ పత్రాలు, యూడీఐడీ కార్డుల జారీ కోసం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలిదశలో 16 రకాల వైకల్యాలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.