హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు చెల్లించాలి: ఎమ్మెల్యే

SRD: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం డిమాండ్ చేశారు. బుధవారం ఎబీవీపీ విద్యార్థులు ఆయనకు వినతిపత్రం సమర్పించి సమస్యలను వివరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.