హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: DMHO

SRD: సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని DMHO లలితాదేవి వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కోహిర్ మండలం బిలాల్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, మహిళల ప్రసవాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.