యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జింక రోడ్డుపై ప్రత్యక్షమైంది. రాచకొండ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నందున అక్కడి నుంచి వచ్చిందని స్థానికులు అన్నారు. దేవలమ్మనాగారం నుంచి కొయ్యలగూడెం వెళ్లే రహదారిపై జింక పరుగులు తీయడంతో స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో స్థానికులు ఈ దృష్యాలను సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు.


