హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామచంద్రరావుకు ఘన స్వాగతం

హనుమకొండ జిల్లా పర్యటనకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు బుధవారం కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడు కోలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని డివిజన్‌లు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి ప్రజలను బలోపేతం చేయాలని కార్యకర్తలను ఆదేశించారు.