హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాంసిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ADB: తాంసి మండలం పోన్నారి సంకట మోచన్ హనుమాన్ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.