JN: దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని బుధవారం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దావెరా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నేతలు YSR చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
దేవరుప్పులలో YSRకు ఘన నివాళులు


