హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయి: ఎమ్మెల్యే

KMR: దివంగత ముఖ్య మంత్రి పేదల జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు, ప్రజలకు ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.