హైదరాబాద్: 28°C
తెలంగాణ

దంతాలపల్లిలో YSR వర్ధంతి కార్యక్రమం

MHBD: మాజీ సీఎం, దివంగత మహానేత డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా దంతాలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా, ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన మహానేత YSR అని నాయకులు కొనియాడారు. ఆయన అందించిన సేవలు,సంక్షేమ పాలన ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయన్నారు.