హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించిన ఏఈవో

నిర్మల్ జిల్లా తానూర్ మండలం బామిని గ్రామంలో బుధవారం డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా ఏఈవో నారాయణ పంటల నమోదు చేపట్టారు. రైతులంతా తమ పంటల వివరాలను గ్రామ వాలంటీర్ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాల నమోదుతో ప్రభుత్వ పథకాలు, రైతులకు అందే ప్రయోజనాలను సులభంగా పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణేశ్, రిషికేశ్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.