MNCL: జన్నారం మండలం రేండ్లగూడ గ్రామ రెవెన్యూ శివారులోని అల్లం వారి కుంటలో మిషన్ కాకతీయ రెండో దశ కింద చేపట్టిన పనులపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కుంట అభివృద్ధికి రూ.43.10 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించగా, రూ.29.20 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. పనులు నాణ్యత లేకుండా తూతూమంత్రంగా చేపట్టినట్లు సమాచారం.
తెలంగాణ
అల్లం వారి కుంటలో నిధుల దుర్వినియోగం..!


