హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుంతలను రోడ్డుకు మరమ్మతులు

MLG: మంగపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రహదారిపై ఏర్పడిన గుంతలను పోలీసు సిబ్బంది మట్టి, కంకరతో పూడ్చివేశారు. పోలీసుల చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.