హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పరిగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

VKB: పరిగి మండలంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి (TRR) స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నూతన కార్డుల ద్వారా రేషన్ సరుకులు మరింత పారదర్శకంగా అందుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.