హైదరాబాద్: 28°C
తెలంగాణ

కీటక జనిత వ్యాధుల నివారణకు ఉచిత వైద్య శిబిరం

KNR: వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి కీటక జనిత వ్యాధులు వ్యాప్తి చెందకుండా పల్లె దవాఖానలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ శ్రావణ్ ఆదేశాల మేరకు జ్వరం లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ మహేశ్వరి, ఏఎన్‌ఎంలు జ్యోతి, వనజ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.