హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు

HYD: పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ గోపాల్‌రావు నగర్‌లో అభిమానులు నిర్వహించిన హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. పవన్ ఆయురారోగ్యాలతో ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవలను కొనియాడారు. స్థానికులు, అభిమానులు పాల్గొన్నారు.