NLG: సిరిపురం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్క బిక్షపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు పోలంపల్లి వీరయ్య, మాజీ ఎంపీటీసీ శెట్టి సతీష్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సిరిపురంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం


